గీతాంజలి -7
My song has put off her
adornments.
She has no pride of dress and decoration.
Ornaments would mar our union ;
they would come between thee and me;
their jingling would drown thy whispers.
My poet's vanity dies in shame before thy sight.
O master poet, I have sat down at thy feet.
Only let me make my life simple and straight,
like a flute of reed for thee to fill with
music.
-
రవీంద్రనాథ్ ఠాగూర్
నా పాటకు ఆభరణాలు అక్కర్లేదు.
అందంగా అలంకరించుకున్నానన్న గర్వం లేదు.
ఈ ఆభరణాలు అలంకారాలు మన కలయికకు అడ్డువస్తాయి.
ఆభరణాలు చేసే గలగలశబ్ధాలు
నీగుసగులను
నాకినిపించకుండా చేస్తాయి.
నీసన్నిధిలో
నేనొక కవినన్న గర్వం అంతరించిపోతుంది.
ఓ కవిప్రభూ..
నీ పాదాలచెంత నేకూర్చొనియున్నాను.
నా జీవితాన్ని
ఒకవేణువు వలే మార్చుకోనీ..
నీ ఊపిరితో ఆ
వేణువును ఆలపించు ప్రభూ..
-ఎస్.పి.మనోహర్
కుమార్ ( అనువాదం)