About Me

Hello,
How are you.
If you want any information regarding Service Matters.
please contact me .
My mobile No:9490762412

19 April 2012

CASH LESS HEALTH SCHEME DETAILS


CASH LESS HEALTH SCHEME DETAILS 
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వము మరియు జె.ఎ.సి-ఎ.పి మధ్య జరిగిన  చారిత్రాత్మక ఒప్పందములో భాగంగా 23-01-2011 ప్రస్తుత మెడికల్ రీ ఎంబర్స్మెంట్ స్థానములో “క్యాస్ లెస్ హెల్త్ స్కీమ్” ను ప్రారంబించుటకు ప్రభుత్వము అంగీకరించింది
ఈ స్కీమ్ లోని ముఖ్యాంశాలు:
1)     ముఖ్యమంత్రి అధ్యక్షులుగా “ఎ.పి. ఎంప్లాయిస్ అండ్ పెన్సనర్స్ హెల్త్ కేర్ ఫండ్” పేరుతో ప్రభుత్వము ఈ పథకమును నిర్వహిస్తుంది.
2)     ఈ పథకము ద్వారా 13.78 లక్షల ఉద్యోగులు, ఉపాద్యాయులు పెన్సనర్స్ లబ్ది పొందుతారు.
3)     ఏ పథకములో చేరుట కొరకు గెజిటెడ్ ఉద్యోగులు నెలకు 120 మరియు నాన్ గెజిటెడ్ ఉద్యోగులు నెలకు 90 రూపాయలు తమ కాంట్రీబ్యుషన్ గా తమ జీతముల నుండి ప్రతి నెల చెల్లించాలి.
4)     కుటుంబమునకు గరిష్టంగా సంవత్సరానికి 3 లక్షలు మరియు వ్యక్తికి 2 లక్షలు గరిష్ట పరిమితి విధించబడింది.
5)     ఈ పథకానికి అయ్యే ఖర్చు ఏడాదికి రూ.350 కోట్లు. దీనిలో 140కోట్లు ఉద్యోగులనుండి కాంట్రీబ్యుషన్ గా మరియు ప్రభుత్వము 250 కోట్లు సమకూర్చుతుంది.
6)     “ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్” లోని దాదాపు 350 ఆసుపత్రులలో 942 రకాల వ్యాదులకు “ ఔట్ పేషెంట్ గా లేదా ఇన్ పేషెంట్ గా” చికిత్స అందించబడును. ఈ జాబితాలో లేని వ్యాదులకు కూడా ప్రత్యేక అనుమతితో చికిత్స అందించబడును.
7)     అర్హులైన  కుటుంబ సభ్యుల వివరలతో కూడిన “హెల్త్ కార్డు” లను ఖజానా శాఖ ఉద్యోగుల వివరాలను సేకరించి అందిస్తుంది. దీని కొరకు ఉద్యొగులు తమ వివరాలను ఆన్ లైన్ లో నింపవలసి ఉంటుంది.
8)     భార్య, భర్త ఇద్దరు ఉద్యొగులు ఐతే ఒక్కరైన కాంట్రీబ్యుషన్  చెల్లిస్తే చాలు కానీ భార్య కూడా కాంట్రీబ్యుషన్  చెల్లిస్తే ఆమెపై ఆధారపడిన తల్లితండ్రులకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది.
9)     రాష్ట్ర ప్రభుత్వ ఉద్యొగులు, పెన్సనర్స్ తో పాటు వారిపై ఆధార పడిన వారి తల్లితండ్రులు, భార్య లేదా భర్త, ఆధారపడిన పిల్లలకు కూడా ఈ పథకము వర్తిస్తుంది.
10)ఎంప్లయీస్ హెల్త్ కేర్ ఫండ్ డ్రాప్ట్ యొక్క టర్మ్-2 నందు ఇవ్వబడిన కుటుంబ నిర్వచనము క్రింద ఇవ్వబడినది.
11) కనీసము 50 పడకలు కలిగి స్త్రీ, పురుషులకు ప్రత్యేక వార్డులు, అంబులెన్స్ అన్ని సౌకర్యాలు కలిగిన ల్యాబ్ ఉన్న ఆసుపత్రులకు మాత్రమే ఈ పథకము నందు అనుమతి లబించును.
12)ఈ ఆసుపత్రులు ప్రతి 2 సంవత్సరాలకు ఒక సారి ఉద్యోగులు, పెన్సనర్స్ మరియు కుటుంబ సభ్యులకు ఒక సారి ఉచితముగా హెల్త్ చెక్ ఉప్ చేయాలి.
13)చికిత్సకు ముందే వ్యాధి, వైద్యము, ఖర్చు మొత్తము వివరాలు ట్రస్ట్ కు తెలియచేస్తే 24 గంటలలో అనుమతి లబిస్తుంది.
ఫ్యామిలో-డిపెండెన్ట్స్
(a)         In case of male Govt. Servant, family means his parents, wife legitimate children including an adopted son and step children residing with and wholly dependent on him;
i)             The word “ wife” includes more than one wife.
ii)            A married daughter who is under the protection of her husband does not come within the definition of “family “ for the purpose of the scheme
iii)           The deserted, divorced or widowed daughters who are residing with entirely dependent on the Govt Servant.
iv)           Family includes adoptive parents who are wholly dependent on the Govt Servant but does not include the real parents though they are wholly dependent on the Govt Servant once the adoption is affected.
b) In case of female Govt Servant it means her parents, husband and children residing with and holly dependent on her


హెల్త్ కార్డు వివరాలు నింపుటకు సూచనలు:
మీ వివరాలు నింపుటకు లాగిన్ అవ్వుట:
Ø  ముందుగా హెల్త్ కార్డులు నింపుటకు వెబ్ సైట్ ను తెరచి అందులో మీ ట్రెజరీ ID నెంబరును ఎంటర్ చెయ్యాలి.
Ø  వెంటనే మీ పేరు వస్తుంది.
Ø  ఆ తరువాత మీకు ఇష్టము వచ్చిన పాస్ వర్డును ఎంటర్ చెయ్యాలి.
Ø  తిరిగి మళ్ళీ ఇంకోకసారి ఎంటర్ చెయ్యాలి
Ø  మీ DDO యొక్క కోడ్ ను ఎంటర్ చెయ్యాలి. ఆ తర్వాత లాగిన్ అవ్వాలి.
Ø  ఇదివరకు ఎప్పుడైనా లాగిన్ అయ్యి ఉంటే మీ ట్రెజరీ ID నెంబర్ ను ఎంటర్ చేసిన తర్వాత మీ పాస్ వర్డ్ ను ఎంటర్ చెయ్యాలి.
Ø  మీ పాస్ వర్డ్ మరిచి పోతే మీ STO ను కాంటాక్ట్ చెయ్యండి.
ఫారం-I నింపుట:
Ø  మీరు లాగిన్ అయిన తరువాత మొదటగా ఫారము-I లో మీ వివరాలు నింపవలసి ఉంటుంది.
Ø  ఫారము-I నాలుగు భాగాలుగా ఉంటుంది. 1 వ భాగములో ఉద్యోగి వివరాలు, 2 వ భాగములో కార్యాలయ వివరాలు, 3 వభాగములో నివాస వివరాలు, 4 వ భాగములో అదనపు వివరాలు నింపవలసి ఉంటుంది.
Ø  *గుర్తు కలిగిన వివరాలు తప్పనిసరిగా నింపాలి.
Ø  సీరియల్ నెంబర్2.Sectory Type లో State Govt/Zilla Parishad/ Aided Edn Institutions/Zilla praja Parishad/ Mandal praja parishad/ Gram panchayat/ Muncipal Corporation/ Muncipalities, etc.. నుండి ఒక దానిని సెలెక్ట్ చేసుకోవలసి ఉంటుంది.
Ø  సీరియల్ నెంబర్ ౩ లో Department Code గా అందరు టీచర్లు School Education సెలెక్ట్ చెయ్యాలి.
Ø  సీరియల్ నెంబర్ 4 లో Employee Designation  దగ్గర మన  designation అనగా Secondary Grade Teacher, PET, SA(Maths),---- ను సెలెక్ట్ చెయ్యాలి.
Ø  సీరియల్ నెంబర్ 10 లో Designation Status లో Gazetted or Non- Gazetted సెలెక్ట్ చెయ్యాలి.
Ø  సీరియల్ నెంబర్ 11లో PRC-2010  ను సెలెక్ట్ చెయ్యాలి.
Ø  మిగిలిన వివరాలు 2,3,4 బాగాలలో నింపాలి. 4 వ భాగములో PF, PRAN, APGLI, AADHAR, RATION CARD – లలో మనకు లేని వివరాలు నింపవలసిన అవసరము లేదు వీటిని ఖాళీగానే ఉంచవలెను.
Ø  అన్నివివరాలు సరిచూచుకున్న తరువాత కిందన ఉన్న UPDATE to continue పై క్లిక్ చేసి ఫారము-2 కు వెళ్ళవలెను.
ఫారం-2 నింపుట:
Ø  ఫారము -2లో మొదటగా మన వివరాలు సరిచూసుకుని కుడి ప్రక్క చివరన గల BROWSE పై క్లిక్ చేసి మీ యొక్క ఫోటోను అప్ లోడ్ చెయ్యాలి. వెంటనే మీ ఫోటో అక్కడ కనిపిస్తుంది.
Ø  (Imp: Photo యొక్క సైజు 100kb కు మించకూడదు. Jpg, jpeg, png ఫార్మాట్ లలో మాత్రమే ఉండాలి)
Ø  పాస్ పోర్ట్ సైజు ఫోటో మాత్రమే అప్ లోడ్ చెయ్యాలి.
Ø  తరువాత డిపెండెంట్స్ డిటైల్స్ ను ఎంటర్ చెయ్యాలి.
Ø  అందులో Dependent Emp Code దగ్గర Dependent  కనుక employee  ఐతే వారి కోడ్ ను ఎంటర్ చెయ్యాలి. లేనిచో ఖాళీగా ఉంచాలి.
Ø  చివరగా ఫోటో అఫ్ లోడ్ చెయ్యాలి.
Ø  తరువాత Add Details  పై క్లిక్ చేసి ఇతర కుటుంబ సభ్యుల వివరాలు కూడా నింపాలి.
Ø  మీరు ఎంటర్ చేసిన కుటుంబ సభ్యుల వివరాలు పైన అడ్డువరుసలలో వచ్చి చేరుతాయి.
Ø  అన్ని వివరాలు సరిచూసుకున్న తరువాత Submit to DDO & Print Form  పై క్లిక్ చేసి మీ వివరాలు ప్రింట్ తీసి మీ DDO కు అందచెయ్యాలి. ఒక కాపీ మీ వద్ద కూడా ఉంచుకోవాలి.
Ø  మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీ DDO ను సంప్రదించండి. ఆ తరువాత మాత్రమే నింపండి.